హైబ్రిడ్ కాన్సెప్ట్ మెగాపిక్సెల్‌ను ఆవిష్కరించిన టాటా
'మెగాపిక్సెల్' పేరుతో ఆవిష్కరించబడిన ఈ బుజ్జికారు ఇటు పెట్రోల్ ఇంజన్‌తోనూ, అటు ఎలక్ట్రిక్ మోటార్‌తోనూ పనిచేస్తుంది. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ రవాణ వ్యవస్థ కోసం రేంజ్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (రీవ్) కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని ఈ ఫోర్-సీటర్ సిటీ స్మార్ట్ కారు యూరప్‌లోని టాటా డిజైన్ విభాగం రూపొందించింది.
మరిన్ని టాటా మెగాపిక్సెల్ చిత్రాల కోసం డ్రైవ్‌స్పార్క్ ఫోటో గ్యాలరీని సందర్శించండి.
ఇందులో లిథియం ఐయాన్ ఫాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో అమర్చిన పెట్రోల్ ఇంజన్ ద్వారా ఈ బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. ఈ కారును ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 900 కి.మీ. రేంజ్ ప్రయాణించవచ్చు. ఇది ప్రతి కి.మీ. కేవలం 22 గ్రా. కార్బన్ డైఆక్సైడ్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. దీని టర్నింగ్ రేడియ్ కేవలం 2.8 మీటర్లు మాత్రమే. ఇది మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదలయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









