పనిచేయని కారు అమ్మినందుకు టాటా మోటార్స్‌కు ఫైన్
మనం ఏదైనా ఒక చిన్న వస్తువును కొనుగోలు చేసేటప్పుడు అద్ బావుందో లేదోనని ఒకటి నాలుగు సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అలాంటిది కారును కొనుగోలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. లేకపోతే కొందరు జాదూగర్ డీలర్లు డొక్కు కార్లను కొనుగోలుదారులకు అంటగట్టేస్తారు. ఇలాంటి ఓ సంఘటనే ఇటీవల ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని ఓ టాటా మోటార్స్ అధీకృత డీలర్ సరిగ్గా పనిచేయని టాటా ఇండికా కారును ఓ కస్టమర్‌కు అంటగట్టాడు. ఆ కారును పదే మెకానిక్ షెడ్డు తీసుకువెళ్తూ చిరాకొచ్చిన సదరు కస్టమర్ ఈ సమస్య గురించి కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. నిజానిజాలను విచారించిన ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ సదరు కస్టమర్‌కు నష్టపరిహారంగా రూ.1.93 లక్షలను చెల్లించాల్సిందిగా టాటా మోటార్స్‌ను, దాని డీలర్‌ను ఆదేశిచింది.
స్టేట్ కమిషన్ అధ్యక్షుడు, జస్టిస్ బ్రర్కత్ అలీ జైదితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తంలో డిప్రిషియేషన్ తర్వా కారు ఖరీదు రూ.1.73 లక్షలను మరియు ఇన్నాళ్లు అతను పడిన మనోవేదను, ఇబ్బందికి గానూ రూ.20,000 నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా తీర్మానం చేసింది.
అయితే, టాటా మోటార్స్ మాత్రం కస్టమర్ వాజ్యాన్ని తోసిపుచ్చింది. తమ వద్దకు సర్వీసింగ్ వచ్చినప్పుడు కస్టమర్ చెప్పిన లోపాలన్నింటినీ సవరించామని పేర్కొంది. కారులో ఏదైనా లోపాన్ని గుర్తించిన వెంటనే కస్టమర్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాన్ని సరిచేసి ఇచ్చామని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








