కొత్త డిజైర్ కారణంగా తగ్గిన పాత డిజైర్ అమ్మకాలు

New Swift Dzire
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ డిజైర్ సెడాన్ గడచిన డిసెంబర్ నెల వరకూ అగ్రస్థానంలో ఉండేది. అయితే, జనవరి నెలలో మాత్రం ఈ స్థానాన్ని టాటా ఇండిగో, మాంజాలు ఆక్రమించేశాయి. అధిక వెయిటింగ్ పీరియడ్, కొత్త స్విఫ్ట్ డిజైర్ విడుదల కారణంగా పాత స్విఫ్ట్ డిజైర్ సెడాన్ అమ్మకాలు భారీగా క్షిణించాయి. జనవరి 2012లో మొత్తం 8637 డిజైర్ కార్లను విక్రయించింది.

డిసెంబర్ నెలలో కార్ కంపెనీలు ప్రకటించిన ఇయరెండ్ డిస్కౌంట్లు, డీజిల్ కార్లకు పెరిగిన డిమాండ్ కారణంగా మాంజా అమ్మకాలు జోరందుకున్నాయి. జనవరిలో 9272 టాటా ఇండిగో/మాంజా కార్లు అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో ఫోర్డ్ ఫియస్టా అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ఈ మోడల్‌పై రూ.50,000 వరకూ డిస్కౌంట్ ప్రకటించడంతో గడచిన జనవరి నెలలో ఈ మోడల్ అమ్మకాలు 81 శాతానికి పైగా పెరిగి 1,411 కార్లు అమ్ముడయ్యాయి.

అలాగే, జనవరి నెలలో ఫియట్ లీనియా అమ్మకాలు 117 శాతానికి పైగా పెరిగి 501 కార్లు అమ్ముడయ్యాయి. ఇకపోతే ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో ఎప్పటిలాగే హ్యుందాయ్ వెర్నా తన జోరును కొనసాగించి 4,300 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకోగా, హోండా సిటీ అమ్మకాలు 1,503 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే జనవరిలో కార్ల అమ్మకాలు ఫర్వాలేదనిపించాయి.

More from DriveSpark

Article Published On: Monday, February 6, 2012, 17:21 [IST]
English summary
India’s largest selling sedan Maruti Suzuki Swift Dzire, is not at all best selling sedan in January 2012, due to waiting period abd new 2012 Swift Dzire launch was around the corner. Company sold 8637 Swift Dzire cars in Jan 2012, but at the same time Tata Motors sold 9272 Indigo/Manza cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+