యూరోప్ కార్లపై దిగుమతి సంఖం తగ్గింపును వ్యతిరేకించిన టాటా

Tata Motors
ఇండియా-యూరప్ దేశాల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్) పట్ల ఇటు కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, అటు కార్ల తయారీ కంపెనీలు మాత్రం మా కడుపులపై కొట్టకండి అంటూ.. తమ గోడును తెలుపుతున్నాయి. ఇరు దేశాల ఈ ఒప్పందం గనుక అమల్లోకి వచ్చినట్లయితే, యూరప్ నుండి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంఖాన్ని భారీగా తగ్గించడం / తొలగించడం జరుగుతుంది.

ఫలితంగా, భారత మార్కెట్లో యూరప్ నుండి దిగుమతి చేసుకున్న కార్ల అతి చౌక ధరకే లభ్యం అవుతాయి. ఈ ఒప్పందం పట్ల కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తుంటే, కార్ మేకర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ స్పందిస్తూ.. ఇలాంటి స్వల్పకాలిక విధానాల వల్ల దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి, దేశంలో పెట్టుబడులు క్షీణించిపోతాయని వ్యాఖ్యానించింది.

"ఇది పరిశ్రమ వృద్ధి అణచి వేస్తుంది. అంతేకాకుండా.. ఇది పరిశ్రమలో అసమానతలను కూడా సృష్టిస్తుంది. ఇలాంటి స్వల్పకాలిక విధానాలు ఆమోదయోగ్యం కానివ"ని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా ఆపరేషన్స్) పిఎమ్ తెలాంగ్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందం వల్ల తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు మంచి జరుగుతుంది అని ఆయను ప్రశ్నించగా.. దీని గురించి ఇప్పుడే ఏం చెప్పలేమని అన్నారు.

ఈ ప్రతిపాదిత ఉచిత-వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఏ) అధికారికంగా చెప్పాలంటే.. ద్వైపాక్షిక పెట్టుబడి మరియు వాణిజ్య ఒప్పందం ప్రకారం, ప్యాసింజర్ కార్లపై ఇండియా దిగుమతి సుంఖాన్ని తగ్గించాలని యూరోపియన్ యూనియన్‌ కోరుకుంటోంది. జూన్ 2007 నుండి ఈ ఒప్పందం గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, February 4, 2012, 11:25 [IST]
English summary
Coming out against the proposal to cut import duty on cars from Europe as envisaged under India-EU FTA, Tata Motors has said that such short-term policy shift will hinder the growth of domestic automobile industry and investment in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+