ఈ ఏడాది 2 లక్షల నానో కార్లను విక్రయిస్తాం: రతన్ టాటా
టాటా నానో కారుతో మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన రతన్ టాటా, ఈ బుజ్జి కారు పట్ల చాలా ధీమాగా ఉన్నారు. ఈ సంవత్సరంలో టాటా మోటార్స్ కనీసం రెండు లక్షల టాటా నానో కార్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉందని ఆయన చెప్పారు. టాటా నానో అమ్మకాల గురించి రతన్ టాటా మాట్లాడుతూ.. "నానో అమ్మకాల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది ఇంకా అయిపోలేదు, ఈ ఏడాది మేము కనీసం 2,00,000 లక్షల నానో కార్లను విక్రయించగలమని నేను భావిస్తున్నాన"ని కంపెనీ 67వ వార్షిక సమావేశంలో ఆయన చెప్పారు.
గడచిన జులై నెలలో టాటా మోటార్స్ మొత్తం 5,485 టాటా నానో కార్లను విక్రయించి అంతకు ముందు జులై నెలతో పోలిస్తే 68 శాతం వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. జులై 2011లో కేవలం 3,260 నానా కార్లను మాత్రమే టాటా మోటార్స్ విక్రయించటం జరిగింది. మార్కెట్ వాటాను సుస్థిరం చేసుకోవాలంటే, నాణ్యమైన వినియోగదారుల సేవలను అందించడంతో పాటుగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందించాలని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








