టాటా మోటార్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా కార్ల్ స్లిమ్

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌ (జిఎమ్)కు చెందిన భారత యూనిట్‌కు మాజీ ఛీఫ్‌గా పనిచేసిన కార్ల్ స్లిమ్ జనరల్ మోటార్స్ సంస్థను వదిలిపెట్టి టాటా మోటార్స్ చెంతకు చేరారు. కార్ల్ స్లిమ్ ప్రస్తుతం చైనా, జనరల్ మోటార్స్‌ల జాయింట్ వెంచర్ 'ఎస్‌జిఎమ్‌డబ్ల్యూ (ఎస్ఏఐసి-జిఎమ్-వులింగ్) మోటార్స్' కంపెనీకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్‌గా పనిచేస్తున్నారు.

టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదా కోసం కంపెనీ గడచిన రెండు నెలలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి కార్ల్ స్లిమ్‌ను నియమించుకుంటున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కార్ల్ స్లిమ్ నియామకం అక్టోబర్ 1, 2012 నుంచి అమలులోకి రానుంది. గతంలో ఈ పదవిలో కొనసాగిన పిఎమ్ తెలాంగ్ స్థానంలో స్లిమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలాంగ్ గడచిన జూన్ నెలలో రిటైర్డ్ అయ్యారు. కార్ల్ స్లిమ్ ఇండియాలోని టాటా మోటార్స్ కార్యకలాపాలతో పాటుగా దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, స్పెయిన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. అయితే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మాత్రం ఇండిపెండెంట్‌గానే నిర్వహించబడుతుంది. కార్ల్ స్లిమ్ జనరల్ మోటార్స్‌లో దాదాపు 17 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 14, 2012, 15:06 [IST]
English summary
Tata Motors has appointed Mr. Karl Slym as Managing Director. He succeeds Mr. PM Telang who superannuated from the Company in June this year. Mr. Slym shall lead all operations of Tata Motors in India and international markets including South Korea, Thailand, Spain, Indonesia, South Africa. Jaguar Land Rover would continue to be managed independently.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+