టాటా మోటార్స్‌కు కలిసొచ్చిన కొత్త సంవత్సరం
గడచిన జనవరి నెలలో టాటా మోటార్స్ ప్రపంచవ్యాప్త అమ్మకాలు (గ్లోబల్ సేల్స్), జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిపి 21 శాతం వృద్ధిని సాధించాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 1,19,799 యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ అమ్మకాల్లో 29,293 యూనిట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కు సంబంధించినవి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం అమ్మకాలు 13 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 9,85,260 యూనిట్లుగా ఉన్నాయి.
కేవలం జాగ్వార్ బ్రాండ్ కార్ల అమ్మకాలను మాత్రమే పరిశీలిస్తే ఇవి 49 శాతం వృద్ధి చెంది 4,547 యూనిట్లుగా నమోదు కాగా, ల్యాండ్ రోవర్ బ్రాండ్ అమ్మకాలు 43 శాతం వృద్ధిని సాధించిం 24,746 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2012లో నాటికి మొత్తం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 26 శాతం పెరిగి 66,785 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే, ఇదే సమయంలో వాణిజ్య వాహనాలు కూడా 15 శాతం వృద్ధి చెంది 53,104 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications









