చవక ధరకే ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న టాటా

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారు టాటా నానోను విడుదల చేసి, యావత్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన టాటా మోటార్స్ ఇప్పుడు మరో అద్భుతానికి తెర లేపేందుకు సిద్ధమవుతోంది. 20,000 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ (మన కరెన్సీలో సుమారు రూ.10 లక్షలకు పైమాటే) ధర కలిగి ఉండేలా ఓ ఎలక్ట్రిక్ కారును టాటా గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన డాసల్ట్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో టాటా గ్రూపుకు చెందిన టాటా టెక్నాలజీస్ ఓ ఎలక్ట్రిక్ కారును డెవలప్ చేస్తుంది.

డాస్సల్ట్ సిస్టమ్స్‌కు చెందిన '3డెక్స్‌పీరియన్స్' (3DEXPERIENCE) ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని నిర్మించడానికి కావల్సిన తొలి దశ అధ్యయనాన్ని టాటా టెక్నాలజీస్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ గురింటి టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ (వెహికల్ ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్‌మెంట్ గ్రూప్) కెవిన్ ఫిషర్ మాట్లాడుతూ.. ఖర్చు పరంగానూ, లక్ష్యంగా చేసుకున్న కస్టమర్లను సంతృప్తిపరచే విధంగానూ ఉండేలా తమ గ్లోబల్ ఇంజనీరింగ్ టీమ్ దీనిని డిజైన్ చేస్తోందని, తుది ఉత్పత్తి ధర రూ.20,000 డాలర్ల కన్నా తక్కువగానే ఉంటుందని ఆయన అన్నారు.


అయితే, ఈ ఎలక్ట్రిక్ వాగనాన్ని ఎప్పుడు విడుదల చేయనుంది, దీని తయారీ కోసం ఎంత మొత్తంలో పెట్టుబడులను వెచ్చించనున్నారనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. డాస్సల్ట్ సిస్టమ్ టెక్నాలజీస్ సాయంతో టాటా గ్రూప్ ఇటీవలే తమ తొలి 'ఎలక్ట్రిక్ మొబిలిటీ' (ఈమో) వాహనాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆరంభంలో అమెరికాలో జరిగిన డెట్రాయిట్‌ మోటార్ షో‌లో "ఈమో" అనే ఎలక్ట్రిక్ కారును టాటా గ్రూప్ ఆవిష్కరించింది.

టాటా ఈమో ఎలక్ట్రిక్ కారు ఫోటో గ్యాలరీ

వాస్తవానికి అక్కడి మార్కెట్లో ఇదే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారని కంపెనీ పేర్కొంది. అమెరికన్ మార్కెట్లో ఈమో ఎలక్ట్రిక్ కారు ధర జస్ట్ 20,000 డాలర్లు మాత్రమే ఉంటుందని ఆ సమయంలో కంపెనీ ప్రకటించింది. టాటా ఈమో ఎలక్ట్రిక్ కారులో నలుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. విశిష్టమైన ఎలక్ట్రిక్ డ్రైవ్, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈమో ఎలక్ట్రిక్ కారు 900 కిలోల బరువును కలిగి ఉంటుంది.

భవిష్యత్తులో పట్టణ ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు కోసం కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. అయితే, దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసేది లేనిదీ మాత్రం కంపెనీ ఇంకా ఖరారు చేయలేదు. టాటా ఈమోను చూడగానే టాటా అందించే చవక కారు నానో డిజైన్ గుర్తుకు రాకమానదు.

More from DriveSpark

Article Published On: Thursday, June 21, 2012, 14:35 [IST]
English summary
Tata Motors is working with Dassault Systemes to develop an electric car priced below $20,000 or Rs.10 lakhs. It has not revealed further details about the project.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+