నానోతో సహా అన్ని కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్

ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న అన్ని కార్ల ధరలు ఇక నుంచి రూ.35,000/- వరకూ ప్రియం కానున్నాయి. గడచిన 16న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్‌ 2012-13లో కార్లపై వివిధ సుంఖాలను పెంచిన నేపథ్యంలో.. కంపెనీ అందిస్తున్న చవక కారు టాటా నానోతో పాటుగా అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.2,000/- నుండి రూ.35,000/- మధ్యలో పెంచనున్నామని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్యాసింజర్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ అందిస్తున్న టాటా నానో, ఇండికా, ఇండిగో వంటి వివిధ మోడళ్ల ధరలు రూ.2,000/- నుండి రూ.8,000/- వరకూ పెరగనున్నాయి. అలాగే, యుటిలిటీ వాహన విభాగంలో కంపెనీ అందిస్తున్న సఫారీ, ఆరియా, సుమో వంటి మోడళ్ల ధరలు రూ.8,000/- నుండి రూ.35,000/- వరకూ పెరగనున్నాయి. అయితే, ఖచ్ఛితంగా ఏయే మోడళ్లపై ఎంత ధర పెంచుతున్నామనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

వాణిజ్య వాహనాల విషయంలో కూడా కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలని భావిస్తున్నామని, ఈ విభాగంలో తమకు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వాహనాలపై 2 శాతం మేర ధరలు పెరగనున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ 2012-13లో చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖాన్ని 10 శాతం నుండి 12 శాతానికి, పెద్ద కార్లపై సుంఖాన్ని 22 శాతం నుండి 27 శాతానికి, దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్ డ్యూటీని 60 శాతం నుండి 75 శాతానికి పెంచడం జరిగింది.

More from DriveSpark

Article Published On: Monday, March 19, 2012, 19:16 [IST]
English summary
Leading Indian vehicle manufacturer Tata Motors has hiked the prices of its passenger vehicles by up to Rs. 35,000. The auto major's decision has come in the wake of the hike in excise duty from 10 per cent to 12 per cent in the union budget for 2012-13.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+