800సీసీ ఇంజన్‌తో మార్కెట్లోకి రానున్న కొత్త టాటా నానో

Tata Nano
మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేస్తూ టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ప్రజల కారు టాటా నానో ఇకపై మరింత శక్తివంతం కానుంది. ఒక్కసారి టాటా నానో కారును పెద్ద ఇంజన్‌తో ఊహించుకోండి.. ఊహించుకోవమెందుకు ఈ ఊహ త్వరలోనే నిజం కానుంది. అసలు విషయం ఏంటంటే.. టాటా నానోలో మరింత శక్తివంతమైన ఇంజన్‌ను ప్రవేశపెట్టాలని టాటా మోటార్స్ యోచిస్తోంది.

ప్రస్తుతం లభిస్తున్న టాటా నానోలో 624సీసీ, 2-సిలిండర్, ఎమ్‌పిఎఫ్ఐ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం 38 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. సాధారణ కార్లకు ఈ శక్తి చాలా తక్కువ. అందుకే టాటా నానోలో పవర్ లేదంటూ పలు విమర్శలు కూడా వచ్చాయి. కాగా.. టాటా మోటార్స్ కొత్తగా ప్రవేశపెట్టనున్న నానో కారులో 800-900సీసీ సామర్థ్యం కలిగిన ఇంజన్‌ను ఉపయోగించనుంది.

దీని గురించి టాటా మోటార్స్ ఛైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ.. "60 బిహెచ్‌పిలు లేదా 80 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే 3-సిలిండర్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నాం, నానోలో పెద్ద టైర్లు, చక్రాలతో కూడిన వేరియంట్లు రానున్నాయ"ని అన్నారు. అయితే, వీటిని ఖచ్చితంగా ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు.

అతి త్వరలో అయితే ఇవి మార్కెట్లోకి రావని, కానీ వీలైనంత వేగంగా మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నామని ఆయన అన్నారు. టాటా నానోలో కంపెనీ 2012 వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న పవర్‌ఫుల్ నానో టాటా మోటార్స్‌కు మరింత పవర్‌ను అందించినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మీరు పవర్‌ఫుల్ నానో కోసం మీరు కూడా ఎదురుచూస్తున్నారా..?

More from DriveSpark

Article Published On: Thursday, March 1, 2012, 11:01 [IST]
English summary
Tata Motors is planning to launch more powerful Nano with more powerful engine. “We have variants coming out with a three-cylinder engine developing 60bhp or 80bhp and we will also give the Nano larger tyres and wheels,” Tata Motors chairman Ratan Tata said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+