ఇండోనేషియా మార్కెట్లోకి ప్రవేశించిన టాటా మోటార్స్

By Ravi

Tata Nano 2012
దేశపు అగ్రగామి ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ గ్లోబల్ మార్కెట్‌ను విస్తరించుకునే దిశలో భాగంగా, తాజాగా ఇండోనేషియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. ఇందులో భాగంగా, జకార్తాను కేంద్రంగా చేసుకొని ఓ అనుబంధ సంస్థను ఏర్పాటుచేసి వచ్చే ఏడాది నుంచి స్థానికంగా తమ ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

టాటా మోటార్స్ ఏర్పాటు చేయనున్న ఈ అనుబంధ సంస్థ ద్వారా అక్కడి మార్కెట్లో ప్యాసింజర్, వాణిజ్య వాహనాల విభాగాల్లోకి ప్రవేశిస్తామని, ప్యాసింజర్ వాహన విభాగంలో చిన్నకార్లు మొదలుకొని బస్సుల వరకు, అలాగే వాణిజ్య వాహన విభాగంలో మినీ ట్రక్కుల నుంచి హెవీ ట్రక్కుల వరకు వివిధ రకాల ఉత్పత్తులను అందించనున్నామని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్‌కు అత్యంత కీలకమైన మార్కెట్లలో టాటా మోటార్స్ కూడా ఒకటి.

ఇండొనేషియా మార్కెట్‌తో పాటుగా ఏషియా ప్రాంతంలో ఆటో సేవలు అందించేందుకు, ఇక్కడ ఒక ఉత్పాదక బేస్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని టాటామోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ తెలిపారు. టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు టాటా నానోను కూడా కంపెనీ ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నానో ఇప్పటికే, శ్రీలంక, నేపాల్ మార్కెట్లలో లభిస్తున్న సంగతి తెలిసిందే.

జకార్తాలో సెప్టెంబర్ 20న జరగనున్న 20 ఇండొనేషియా అంతర్జాతీయ మోటార్ షోలో టాటా మోటార్స్ కూడా పాల్గొంటుందని, ఇందులో మొత్తం 14 ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను ప్రదర్శనకు ఉంచడం జరుగుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (వాణిజ్యవాహన విభాగం) రవి పిషారోడి తెలిపారు. ఇండోనేషియాలోని స్థానిక కస్టమర్ల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు విపణిలో అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 12, 2012, 15:41 [IST]
English summary
Tata Motors, India’s largest automobile company, today announced its entry into Indonesia, the largest automobile market in the ASEAN. The company has set up a wholly owned Jakarta-based subsidiary, PT Tata Motors Indonesia, and will foray into both passenger and commercial vehicles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+