20 రోజుల్లో 20 కార్లు: టాటా మోటార్స్ కొత్త ఆఫర్

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ కార్ల కోసం ఓ కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. 20 రోజుల్లో 20 కార్లను సొంతం చేసుకోండి అంటూ కస్టమర్ల కోసం లక్కీ డ్రాను ఆఫర్ చేస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆగస్టు 31 లోపుగా టాటా కార్లను కొనుగోలు చేసి, రెండు చిన్న ప్రశ్నలకు సమాధానం చేసి, ఓ స్లోగన్‌ను రాయాల్సి ఉంటుంది.

ఇలా సేకరించిన ధరఖాస్తులను అన్నింటిన పరిశీలించి ఇందులోని ప్రశ్నలకు సరైన సమాధనాం చెప్పి, ఓ చక్కటి స్లోగన్ రాసిన లక్కీ విజేతకు ఓ టాటా కారును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ఇలా 20 రోజుల పాటు 20 టాటా కార్లను బహుమతిగా ఇవ్వనుంది. అంతేకాకుండా.. వివిద గిఫ్ట్‌ చెక్‌లను నగదు బహుమతులను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఈ స్కీమ్‌లో కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
* 20 రోజుల పాటు ప్రతిరోజు ఒక కారు.
* ప్రతిరోజు ఇద్దరు విజేతలకు రూ.50,000 గిఫ్ట్ చెక్ (ఒక్కొక్కరికి).
* ప్రతిరోజు ఎడుగురు విజేతలకు రూ.20,000 గిఫ్ట్ చెక్ (ఒక్కొక్కరికి).
* ప్రతి కరెక్ట్ ఎంట్రీపై రూ.500 నగదు బహుమతి.

అంతేకాకుండా.. ఉచిత ఇన్సూరెన్స్, ఎక్సేంజ్ బోనస్ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది. కార్ల అమ్మకాలు తగ్గుతుండటం మరియు పండుగ సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలాగే, టాటా మోటార్స్ కూడా తమ అమ్మకాలను పెంచుకునేందుకు ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెలాఖరు వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల కోసం టాటా మోటార్స్ అధీకృత వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Monday, August 13, 2012, 19:42 [IST]
English summary
Tata Motors has launhced special campgine to boost its car sales. Now Tata coustomers will get 20 tata cars in 20days. All you have to do is buy a Tata car till 31st August and answer 2 simple questions and fill in a slogan to win a car each day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+