డిసెంబర్ నెలలో 27% పెరిగిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

Tata Global Sales
గతంలో దాదాపు దివాళ తీసే స్థితిలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న తర్వాతి నుండి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది. గడచిన నెలలో టాటా మోటార్స్ మొత్తం గ్లోబల్ అమ్మకాలు (జేఎల్ఆర్ సేల్స్‌తో కలిపి) 27 శాతం వృద్ధిని సాధించి 1,14,920 యూనిట్లుగా నమోదయ్యాయి.

కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టాటా మోటార్స్ మొత్తం గ్లోబల్ సేల్స్ 12 శాతం వృద్ధిని నమోదు చేసుకొని 8,65,400 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మీద డిసెంబర్‌ 2011 నెలలో వాణిజ్య వాహన అమ్మకాలు 12 శాతం పెరిగి 53,854 యూనిట్లుగా నమోదు కాగా.. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45 శాతం పెరిగి 61,066 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇదే నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ మొత్తం విక్రయాలను గమనిస్తే, ఇవి అత్యధికంగా 45 శాతం వృద్ధి చెంది 30,981 యూనిట్లుగా నమోదు కాగా, కేవలం జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 4,726 యూనిట్లు గానూ, ల్యాండ్‌ రోవర్ బ్రాండ్ అమ్మకాలు 26,255 యూనిట్లు గానూ నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 17, 2012, 12:44 [IST]
English summary
The Tata Motors Group global wholesales, including Jaguar Land Rover, were 114,920 nos., in December 2011, higher by 27% over December 2010. Cumulative sales for the fiscal are 865,400 higher by 12% compared to the corresponding period in 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+