మార్చిలో 26 శాతం పెరిగిన టాటా గ్లోబల్ అమ్మకాలు
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ప్రపంచ మార్కెట్లలో తన విజయ పతాకాన్ని ఎగురవేస్తుంది. గడచిన మార్చి నెలలో తమ అంతర్జాతీయ అమ్మకాలు 26 శాతం వృద్ధిని సాధించాయని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)తో సహా అన్ని వాహనాల విక్రయాలు మార్చిలో సంతృప్తికరంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
మార్చి 2012లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 51 శాతం వృద్ధిని సాధించి 36,471 యూనిట్లుగా నమోదు కాగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 41 శాతం వృద్ధితో 75,864 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 12 శాతం వృద్ధిని నమోదు చేసి 63,791 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ వివరించింది.
మొత్తమ్మీద 2011-12 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విదేశీ అమ్మకాలు, ఇదివరకి ఆర్థిక సంవత్సరం అమ్మకాలతో పోల్చితే 16 శాతం వృద్ధిని సాధించి 12,52,173 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా గ్లోబల్ అమ్మకాల్లో టాటా, టాటా దేవూ, హిస్పానో కరోసెరాల వాణిజ్య వాహనాలు, టాటా ప్యాసింజర్ వాహనాలు, జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్ వాహనాలు కలిసి ఉన్నాయి.


Click it and Unblock the Notifications









