ఏప్రిల్‌లో 87,377 యూనిట్లుగా నమోదైన టాటా గ్లోబల్ సేల్స్
జాగ్వార్ ల్యాండ్ రోవర్ అండదండలతో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రపంచ మార్కెట్లలో మంచి జోరును కొనసాగిస్తుంది. గడచిన ఏప్రిల్ నెలలో టాటా మోటార్స్ ప్రపంచవ్యాప్త అమ్మకాలు (జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో కలిపి) 87,377 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏప్రిల్ 2011 నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ 2012 నెలలో టాటా గ్లోబల్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 49,369 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, ఇదే సమయంలో టాటా, టాటా డేవూ, టాటా హిస్పాన్ కర్రోసెరా రేంజ్ వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 38,008 యూనిట్లుగా నమోదయ్యి గతేడాది ఇదే సంవత్సరంతో పోల్చుకుంటే 8 శాతం క్షీణించాయి.
ఇదే కాలానికి టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 29 శాతం వృద్ధిని సాధించి 25,143 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేవలం జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలను మాత్రమే గమనిస్తే అవి 17 శాతం మేర వృద్ధిని సాధించి 3,603 యూనిట్లుగా నమోదు కాగా.. ల్యాండ్ రోవర్ బ్రాండ్ అమ్మకాల 32 శాతం మేర వృద్ధిని సాధించి 21,540 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications









