ఆగస్టు నెలలో 13 శాతం పెరిగిన టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్

అలాగే, గడచిన ఆర్థిక సంవత్సరంతో ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి కంపెనీ మొత్తం అమ్మకాలు కూడా 11 శాతం మేర వృద్ధిని సాధించి 4,75,381 యూనిట్లుగా నమోదయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 2012లో మొత్త వాణిజ్య వాహనాల అమ్మకాలు 4 శాతం వృద్ధి చెంది 50,084 యూనిట్లుగా నమోదు కాగా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 23 శాతం వృద్ధిని సాధించి 47,141 యూనిట్లుగా నమోదయ్యాయి.
గడచిన నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 24,060 యూనిట్లుగా నమోదయ్యి 13 శాతం వృద్ధిని కనబరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మొత్తం అమ్మకాలు 1,34,433 యూనిట్లుగా నమోదయ్యి 31 శాతం వృద్ధిని సాధించాయి. ఆగస్టు 2012 నెలలో 2,960 యూనిట్లు జాగ్వార్ కార్లు అమ్ముడుపోగా, 18,798 యూనిట్లు ల్యాండ్ రోవర్ యుటిలిటీ వాహనాలు అమ్ముడుపోయాయి.


Click it and Unblock the Notifications








