నానో, ఆరియా మినహా మిగిలిన మోడళ్ల ధరలు పెంచిన టాటా

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్, కొనుగోలుదారులపై మరోసారి ధరాఘాతాన్ని సంధించింది. కంపెనీ అందిస్తున్న చిన్న కారు టాటా నానో, ప్రీమియం క్రాసోవర్ టాటా ఆరియాలు మినహా మిగిలిన అన్ని ఇతర మోడళ్ల ధరలను రూ.12,000 వరకూ పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అధిక ఇన్‌పుట్ ధరల కారణంగానే ఉత్పత్తుల ధరలు పెంచామని, పెరిగిన ధరలు నిన్నటి నుండే దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

"గత కొద్ది కాలం నుండి అధిక ఉత్పాదక వ్యయాలు మాపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించాం. పెరిగిన ధరలు మోడల్‌ను బట్టి రూ.7,000 నుండి రూ.12,000 వరకూ ఉంటాయ"ని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

గడచిన నెలలో మారుతి సుజుకి, జనరల్ మోటార్స్ వంటి ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా పెరిగిన ఉత్పాదక వ్యయం, రూపాయి విలువ క్షీణతల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలను రూ.17,000 వరకూ పెంచిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, February 10, 2012, 13:38 [IST]
English summary
Tata Motors today said that it has increased the prices of its passenger vehicles, except small car Nano and premium crossover Aria, by up to Rs 12,000 to mitigate the impact of high input costs. The company said the price hike has been with effect from yesterday across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+