2012 వెర్షన్ టాటా నానోపై ఎక్సేంజ్ బోనస్ ఆఫర్

ఈ ఎక్సేంజ్ బోనస్ ఆఫర్ ఫిబ్రవరి 29, 2012 వరకూ చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గడచిన నవంబర్ నెలలో టాటా నానో ఓ రిఫ్రెష్డ్ వేరియంట్‌ను టాటా మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చేయబడిన ఇంజన్, మెరుగైన సస్పెన్షన్, అధిక మైలేజ్ (లీటర్ పెట్రోల్‌కు 25.4 కి.మీ.), బెస్ట్ ఇన్-క్లాస్ ఏసి, 10 అట్రాక్టివ్ కలర్స్‌లో కొత్త 2012 టాటా నానో లభిస్తుంది.
ఓ వైపు కార్ల తయారీ కంపెనీలు వివిధ సాకులు చెప్పి ధరలు పెంచుతున్న తరుణంలో, టాటా నానోలో ఇన్ని మార్పులు చేసినప్పటికీ, కంపెనీ దీని ధరను మాత్రం యధాతథంగానే ఉంచింది. ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తున్న టాటా నానో కార్ల ధరలు రూ.1.40 లక్షల నుంచి 1.96 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








