8 లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న నానో

ఆరంభంలో పలు విమర్శలను ఎదుర్కుని ఇప్పుడు అద్భుతంగా సాగిపోతున్న టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో వియవంతంగా ఎనిమిది లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. అత్యం పాపులర్ అయిన ఈ సామాజిక ప్రచార మాధ్యమాన్ని (సోషల్ మీడియా క్యాంపైన్)ను టాటా నానో ఎంతో చక్కగా నినియోగించుకుంటుంది.

టాటా నానోలో 2012 వెర్షన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ మోడల్ దశ తిరిగిందని చెప్పవచ్చు. మెరుగైన పవర్, ఏసి, సస్పెషన్, కొత్త ఇంటీరియర్స్, ఆకర్షణీయమైన రంగులతో పాత ధరకే కొత్త వేరియంట్‌ను టాటా మోటార్స్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 2012 వెర్షన్ టాటా నానో 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 38 పిఎస్‌ల శక్తిని, 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త నానో ఆటోమోటివి రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరు పెట్రోల్‌కు 25.4 కి.మీ మైలేజీనిస్తుంది. ఇది గంటకు గరిష్టందా 105 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది. కొత్త నానో స్టాండర్డ్, సిఎక్స్ ఎల్ఎక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా నానో ధరలు రూ.1.41 లక్షల నుండి రూ.2 లక్షల మధ్యలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 5, 2012, 18:33 [IST]
English summary
The Tata Nano has an ever increasing fan base particularly on Facebook. The low cost small car from Tata Motors now boasts more than 8 lakh fans on its Facebook fan page.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+