నానో కోసం కొత్తగా 230 ప్రత్యేక షోరూమ్‌లు: టాటా మోటార్స్

టాటా మోటార్స్ ముద్దుల కారు 'నానో'లో కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన 2012 వెర్షన్‌ కారణంగా మార్కెట్లో ఈ మోడల్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో, ఈ మోడల్ అమ్మకాలను మరింతగా పెంచుకునేందుకు కంపెనీ విస్తరణ కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు టాటా నానో కారు అండుబాటులోకి తీసుకురావడానికి ఈ మోడల్ కోసం మరిన్ని ప్రత్యేక షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాటా నానో కోసం 120 ప్రత్యేక షోరూమ్‌లు (ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్) ఉన్నాయి. కాగా.. ప్రస్తుత సంవత్సరం ముగిసే నాటికి అదనంగా 230 షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని టాటా మోటార్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిఎమ్‌ తెలంగ్‌ తెలిపారు. ఈ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో కేవలం నానో కార్లను మాత్రమే కంపెనీ విక్రయించనుంది. కంపెనీ కొత్తగా ఏర్పాటు చేయనున్న షోరూమ్‌లలో ఎక్కువగా టైర్2, టైర్3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా ఉంటాయని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 22, 2012, 11:45 [IST]
English summary
The Tata Nano is by far the most prestigious car project for Tata Motors and its soon to retire chairman Ratan Tata. The budget small car was envisaged a an alternative to Indian two wheeler users but it has not been able to perform as well as expected. Tata Motors has tried several marketing methods to boost its sales and here comes the latest update. Now company is planning to have 230 new dedicated sales outlets in the current year for their people's car Tata Nano.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+