నానో 'చీప్' కారే కానీ 'ఫ్లాప్' కారు కాదు: రతన్ టాటా

టాటా మోటార్స్ అందిస్తున్న చీప్ కారు ఇకపై పేదోడి కారుగా పిలువబడదని ఆ కంపెనీ అధినేత రతన్‌ టాటా అన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో పలు మోడళ్లను ఆవిష్కరించేందుకు, తన వారసుడు సైరస్ మిస్త్రీతో సహా రతన్ టాటా విచ్చేశారు.

మరిన్ని చిత్రాల కోసం డ్రైవ్ స్పార్క్ గ్యాలరీని సందర్శించండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ విడిభాగాల కంపెనీల నుండి కొనుగోలు చేసిన స్పేర్ పార్ట్‌ల కారణంగా కొన్ని టాటా నానో కార్లలో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించేందుకు తాము తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని ఆయన అన్నారు.

కాగా.. టాటా మోటార్స్ అందిస్తున్న ఈ బుజ్జి కారు నానోల రెండు కొత్త వేరియంట్లను కంపెనీ ఢిల్లీ ఆటో ఎక్స్‌లో ప్రదర్శనకు ఉంచింది. టాటా నానోలో ఓ సిఎన్‌జీ వేరియంట్‌ను, అలాగే మరొక కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించింది. అయితే, డీజిల్ వేరియంట్ నానో కోసం ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది.

ఈ షో మొత్తానికి కంపెనీ గతంలో విడుదల చేసిన పిక్సెల్ కాన్సెప్ట్ కారు ప్రధాన ఆకర్షనగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Monday, January 9, 2012, 18:18 [IST]
English summary
Tata Motors chairman Ratan Tata has admitted to mistakes in the marketing and distribution of the Nano and said the company will do everything to undo the perception that it is a poor man's car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+