నానో మర్చెండైస్ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టాటా నానో
అసలు విషయం ఏంటంటే... టాటా నానో మర్చెండైస్ (టాటా నానో ఉపకరణాలు)ను విక్రయించేందుకు గానూ ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ ఈబే (Ebay)లో కంపెనీ ఓ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్‌లో టాటా నానో టీ షర్టులు, నానో క్యాప్స్, నానో ఆప్టికల్ మౌస్, నానో పెన్‌డ్రైవ్స్, నానో కీచైన్స్, నానో స్కేల్ మోడల్స్, నానో వాచ్‌లు మొదలైనవి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
టాటా నానో బ్రాండ్ వస్తువల పట్ల క్రేజ్ ఉండే వారి కోసం కంపెనీ వీటిని ఈబే ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా టాటా మోటార్స్ నానో ప్రోడక్ట్ గ్రూప్ హెడ్ డెల్నా ఆవారి మాట్లాడుతూ.. తమ మార్కెటింగ్ ప్రణాళికలో భాగంగా, ఇది వరకు ఊహించని విధంగా టాటా నానో బ్రాండింగ్ కోసం ఈ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నామని, ఆన్‌లైన్‌లో టాటా నానో బ్రాండ్ ఎంతో యాక్టివ్‌గా ఉందని, ఫేస్‌బుక్‌లో నానోకు సుమారు 16 లక్షల మంది అభిమానులు ఉన్నారని ఆమె చెప్పారు.
టాటా నానో మర్చెండైస్ ఆన్‌లైన్ స్టోర్‌ను చూడటానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి: www.ebay.in/tatanano


Click it and Unblock the Notifications









