బంగ్లాదేశ్‌లో జెండా పాతేందుకు సిద్ధమైన టాటా నానో..!

గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ మార్కెట్‌కు వెళ్లాల్సిన టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో, అధిక ఎక్సైజ్ సుంఖాల కారణంగా తన ఫారిన్ ట్రిప్‌ను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దేశీయ విపణిలో రూ.1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్ముడవుతున్న టాటా నానో బంగ్లాదేశ్‌కు మార్కెట్‌కు వెళ్లే సరికి 5,00,000 టాకాలు (6098 డాలర్లు) ఖరీదు పలుకుతుండటంతో కంపెనీ నానోను బంగ్లాదేశ్‌లో విడుదల చేయటాన్ని వాయిదా వేసింది.

అయితే, తాజాగా ఇప్పుడు ఈ కారును బంగ్లాదేశ్‌కు దిగుమతి చేసుకోనున్నామని బంగ్లాదేశ్‌లో టాటా మోటార్స్‌కు అధీకృత డిస్ట్రిబ్యూటర్ అయిన నిటోల్ మోటార్స్ చైర్మన్‌ అబ్దుల్‌ ముత్లబ్‌ అహ్మద్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో అధిక దిగుమతి సుంకం కారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతిదార్లు ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వుంటుంది. ఫలితంగా కార్ల ధర కూడా అధికంగా ఉంటుంది. నానో కారు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తే.. అక్కడి మార్కెట్లో నానో చౌక కారుగా నిలువనుంది.

ప్రారంభ దశలో భాగంగా 2,000 నానో కార్లను బంగ్లాదేస్‌కు దిగుమతి చేసుకోనున్నామని, డిమాండ్‌ను అవసరమైతే మరిన్న కార్లను కూడా దిగుమతి చేసుకుంటామని అహ్మద్‌ తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జపాన్‌ నుంచి దిగుమతి చేసుకునే సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇవి అధిక ధరను కలిగి ఉన్నప్పటికీ వీటి నాణ్యత, విశ్వసనీయతల కారణంగా ఈ కార్లు బంగ్లాదేశ్‌లో మంచి ప్రాచుర్యాన్ని సంపాధిచుకున్నాయి. ప్రస్తుతం భారత్ నుండి అంబాసిడర్‌ కార్లు మాత్రమే టాక్సీ క్యాబ్‌లుగా ఎగుమతి అవుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 21, 2012, 11:52 [IST]
English summary
The Tata Nano will finally cross the Ganga and be sold in Bangladesh soon. The Indian small car was scheduled to be sold in the neighboring country in October 2012 itself. But an issue with the car's price lead to a delay. But Nitol-Niloy Group who is the official importer of the Nano has now confirmed the small car will make its Bangladesh debut next month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+