డీజిల్ కార్లపై అదనపు సుంఖం విధించాలి: సిఎస్ఈ

ఇలాంటి లగ్జరీ కార్లను ఉపయోగించే సంపన్న వర్గాలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ డీజిల్ ఇంధనంపై రాయితీ ఇవ్వకూడదని సిఎస్ఈ వ్యాఖ్యానించింది. అధిక ఇంజన్ సామర్థ్యం కలిగిన డీజిల్ కార్లపై రూ.1.62 లక్షల వరకూ అదనంగా పన్ను వసూలు చేయాలని సిఎస్ఈ డిమాండ్ చేస్తోంది.
రానున్న బడ్జెట్‌లో 1,400సీసీ (క్యూబిక్ కెపాసిటీ) కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన చిన్న కార్లపై అదనంగా రూ.81,000లకు సమానమైన ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని ప్రణాళికా సంఘం నియమించిన కిరిత్ పరిఖ్ కమిటీ సిఫార్సు చేసిందని సిఎస్‌ఇ కార్యనిర్వహణ సంచాలకులు, వాయు కాలూష్య నివారణ సంస్థ అధ్యక్షులు అనుమితా రారు చౌదరి తెలిపారు.
ఇదిలా ఉండగా.. డీజిల్ ఇంధనాన వినియోగాన్ని అదుపు చేసేందుకు గానూ, కేంద్ర ఆర్ధిక శాఖ కూడా రానున్న బడ్జెట్ (2012-13)లో, డీజిల్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచే దిశగా సన్నాహాలు చేస్తుంది. ఈ విధంగానైనా వ్యక్తిగత వాహనాలకు వాడే డీజిల్ వినియోగాన్ని కాస్తయినా తగ్గొచ్చని, ఫలితంగా సబ్సిడీ భారంలో కాస్తంత ఊరటను పొందవచ్చని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇది గనుక ప్రవేట్ సంస్థల అధీనంలోకి వెళ్లినట్లయితే, నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల మాదిరిగానే డీజిల్ ధరలు కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో డీజిల్ ధరలపై నియంత్రణలు తొలగించే కన్నా, వీటిపై అధిక సుంఖాలను విధిస్తే ఫలితం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








