సచిన్ టెండూల్కర్ నిస్సాన్ జిటిఆర్ స్పోర్ట్స్ కార్ డిటేల్స్
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్ కారు రైట్ హ్యాండ్ డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 300 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో అమర్చిన అత్యంత శక్తివంతమైన ట్విన్ టర్బో ఇంజన్ 6,400 ఆర్‌పిఎమ్ వద్ద 390 కి.వా. (530 పిఎస్)ల శక్తిని, 3,200-6,000 ఆర్‌పిఎమ్ వద్ద 612 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ఇందులో లాంచ్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసినప్పుడు కేవలం 3.2 సెకండ్లలో 0-100 కి.మీ. వేగాన్ని, ఆన్ చేయనప్పుడు 3.8 సెకండ్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. దీని విలువ సుమారు 87,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 40 లక్షలు). ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం సచిన్ సుమారు రూ.45 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.
సచిన్ వద్ద పాత ఫెరారీ మోడెనా 360 రిజిస్ట్రేషన్ నెంబరు (MH 02 AD 9999)నే ఈ సరికొత్త నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుకు కూడా కేటాయించటం జరిగింది. సచిన్ టెండుల్కర్ వద్ద రెండు బిఎమ్‌డబ్ల్యూ కార్లు, ఒక స్కొడా కారు కూడా ఉంది.


Click it and Unblock the Notifications









