2012 ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్మాలా వన్ రేస్ షెడ్యుల్
గ్రేటర్ నోయిడాలో ఇటీవలే ప్రారంభమైన బుధ్ ఇంటర్నేషన్ సర్క్యూట్ (బిఐసి) మరోసారి ఫార్ములా వన్ కార్ల శబ్ధాలతో మారు మ్రోగనుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్మాలా వన్ రేస్‌కు వేదిగా మారిన బిఐసిలో జరగనున్న 2012 ఇండియన్ గ్రాండ్ ప్రి షెడ్యూల్ విడులయ్యింది. అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 28 వరకూ ఈ ఫార్ములా వన్ రేస్ జరగనుంది.
అక్టోబర్ 26న ట్రాక్‌పై మొదటిసారిగా జేకే రేసింగ్ ఏసియా సిరీస్ 5.14 కి.మీ. సర్క్కూట్‌లో ఉదయం చక్కర్లు కొట్టనుంది. అనంతరం ఉదయం పది గంటలకు ఎఫ్1 ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటలకు రెండవ ఎఫ్1 సెషన్ ఉంటుంది. ఆ రోజున బిఐసిని సందర్శించే వారికి ఎమ్ఆర్ఎఫ్ ఎఫ్2000 కార్లను చూసే అవకాశం ఉంటుంది. ఇందులో అనేక మంది ఇండియన్, ఇంటర్నేషనల్ డ్రైవర్లు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి:

అక్టోబర్ 26, శుక్రవారం:
- జేకే రేసింగ్ ఏసియా సిరీస్ (ప్రాక్టీస్): 08:45-09:15
- ఎఫ్1 ఫస్ట్ ప్రాక్టీస్ 1: 10:00-11:30
- ఎమ్ఆర్ఎఫ్ ఛాలెంజ్ (ప్రాక్టీస్): 12:00-12:30
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ (పిట్ లేన్ వాక్): 12:35-13:45
- ఎఫ్1 సెకండ్ ప్రాక్టీస్: 14:00-15:30
- ఎఫ్1 ప్రెస్ కాన్ఫరెన్స్: 16:00-17:00
- ఎమ్ఆర్ఎఫ్ ఛాలెంజ్ (క్వాలిఫైయింగ్): 16:00-16:30
- మార్షల్ పిట్ లేన్ వాక్: 17:45
అక్టోబర్ 27, శనివారం:
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ (క్వాలిఫైయింగ్): 09:15-09:45
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ (పిట్ లేన్ వాక్): 09:50-10:40
- ఎఫ్1 థర్డ్ ప్రాక్టీస్: 11:00-12:00
- ఎమ్ఆర్ఆఫ్ ఛాంపియన్‌షిప్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 12:25-12:55
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 13:00-13:45
- ఎఫ్1 క్వాలిఫైయింగ్: 14:00
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ ఫస్ట్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 15:30-16:00
అక్టోబర్ 28, ఆదివారం:
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 10:00-10:50
- ఎమ్ఆర్ఆఫ్ ఛాంపియన్‌షిప్ సెకండ్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 11:00-11:30
- జేకే ఏసియా రేసింగ్ సిరీస్ సెకండ్ రేస్(10 ల్యాప్స్ లేదా 25 నిమిషాలు): 12:00-12:30
- ఎఫ్1 పడ్డాక్ క్లబ్ పిట్ లేన్ వాక్: 12:35-14:15
- ఎఫ్1 డ్రైవర్స్ గ్రిడ్ పరేడ్: 13:30
- ఎఫ్1 స్టార్టింగ్ గ్రిడ్ ప్రజెంటేషన్: 13:40-14:15
- జాతీయ గీతం: 14:46
- గ్రాండ్ ప్రి: 15:00


Click it and Unblock the Notifications








