రేపే మహీంద్రా ఎక్స్‌యూవీ500 లక్కీ డ్రా విజేతల వెల్లడి

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) గ్లోబల్ ఎస్‌‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" కోసం ప్రారంభించిన సెకండ్ ఫేజ్ బుకింగ్‌లకు అంచనాలకు మించి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కంపెనీ, బుకింగ్‌ల సంఖ్య 7,200 యూనిట్లను దాటినట్లయితే లక్కీ డ్రా ప్రాతిపదికన డెలివరీలను అందిస్తానమని పేర్కొంది.

ఈ నేపథ్యంలో లక్కీ డ్రా ఫలితాలు రేపు (ఫిబ్రవరి 15, 2012) సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. సెకండ్ ఫేజ్ బుకింగ్స్‌లో భాగంగా, ఈసారి మొత్తం 19 నగరాల్లో కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది, ఇందులో సుమారు 25,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు రావటం జరిగింది. ఈ లక్కీ డ్రాను ప్రముఖ వృత్తి సేవల సంస్థ డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ప్రై లి (డిటిటిఐపిఎల్) నిర్వహిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాల డెలివరీలో పారదర్శకతను పాటించేందుకు మాత్రమే ఈ లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టామని ఎమ్ అండ్ ఎమ్ పేర్కొంది. సాధారణంగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 డెలివరీ సమయం గరిష్టంగా నాలుగు నెలల వరకూ ఉంటోంది. ఈ ఎస్‌యూవీకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,000 యూనిట్లకు పెంచినట్లు కంపెనీ తెలిపింది.

ఏదేమైనప్పటికీ, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ ఎవరిని వరిస్తుందో రేపు సాయంత్రం లోపుగా తెలిపోనుంది. లక్కీ డ్రా ఫలితాలను మహీంద్రా ఎక్స్‌యూవీ500 అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 14, 2012, 17:14 [IST]
English summary
The XUV500 Draw Results will be announced tomorrow 15th Feb 2012, at 5pm IST. The results will be available on our website www.mahindraxuv500.com. The draw process will be validated by the professional services firm Deloitte Touche Tohmatsu India Pvt. Ltd. (DTTIPL) as per mutually agreed scope & terms between M&M and DTTIPL.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+