కారులో పసిపాపలు ఉన్నప్పుడు జాగ్రత్త..! లేకపోతే..

Baby On Board
కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఆన్-బోర్డులో పసిపిల్లలు ఉన్నట్లయితే ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి. వీరి విషయంలో అప్రమత్తంగా లేకుండా ఉన్నట్లయితే, మారుతి విషయంలో జరిగినట్లుగానే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. చెన్నైలోని 'మారుతి' అనే వ్యాపారవేత్త అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణం తన రెండేళ్ల పసికందును ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

మారుతి తన రెండేళ్ల బాబు (ఇళమారన్)ను కారులో ఉంచి, ఏసి రన్నింగ్‌లో పెట్టేసి లాక్ చేసుకుని మీటింగ్‌కు వెళ్లాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చేయన్న మారుతికి మీటింగ్ ముగిసి బయటకు వచ్చేసరికి దాదాపు గంటకు పైగా సమయం పట్టింది. ఈ లోపుగా కారులో ఉన్న రెండేళ్ల బాలుడు ఏసి చల్లనదం ఎక్కువై స్పృహ తప్పి పోయాడు.

మీటింగ్ అనంతరం కారు దగ్గరకు వచ్చి, లోపల ఉన్న ఇళమారన్‌ను చూసిన మారుతి వెంటనే, ఆ బాలుడిని హాస్పత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే ఆ బాబు మరణించినట్లు వైద్యులు ధృవపరిచారు. దీనికి కారణం కేవలం అతని అజాగ్రత్త, అప్రమత్తతే. పసికందులు కారులో ఉన్నప్పుడు, కారు నడిపే వారి నుండి, అందులో ప్రయాణించే వారి వరకూ అందరూ చాలా మెళకువగా వ్యవహరించాల్సి ఉంటుంది.

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన సీట్ కవర్‌లు ఉంటాయి. వాటిని ఉపయోగించటం ద్వారా కారులో పిల్లలు సేఫ్‌గా ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడుపుతున్నప్పటికీ, ఎదుటి వారి అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే, పసిపిల్లలు ఉండే కారులో ఎప్పుడూ కూడా "Baby On Board" అనే హెచ్చరిక సందేశాన్ని మీ వాహనం వెనుక వైపు ప్రయాణిస్తున్న వారికి, ముందు వైపుగా వస్తున్న వారికి తెలిసేలా సైన్ బోర్డు ఉంచటం చాలా మంచిది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 13, 2012, 17:25 [IST]
English summary
Chennai is a place where you need to run the car's AC in almost every month of the year. Little did Maruthi, the father of two year old Ilamaran, know that his own car would be the death bed of his son. A ten minute meeting stretching to an hour meant his son spent one hour locked inside a car with the AC running. The boy was found unconscious and was declared dead when taken to a hospital.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+