సరసమైన ధరకే విలాసవంతమైన టొయోటా క్యామ్రీ విడుదల

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న 'టొయోటా క్యామ్రీ' లగ్జరీ సెడాన్‌లో 2012 వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. పాత వెర్షన్ క్యామ్రీతో పోల్చుకుంటే, ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా అనేక మార్పులు చేర్పులతో కంపెనీ ఈ సరికొత్త వెర్షన్‌ను తీర్చిదిద్దింది. టొయోటా క్యామ్రీ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధర రూ.24.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.

సరికొత్త టొయోటా క్యామ్రీ కోసం నేటి నుండే బుకింగ్‌లను స్వీకరిస్తామని, బుకింగ్ మొత్తం రూ.50,000 లుగా నిర్ణయించామని, అలాగే ముందుగా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా డెలివరీలను చేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, వెయిటింగ్ పీరియడ్ ఖచ్చితంగా ఎన్నిరోజులు అనే విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.

కొత్త టొయోటా క్యామ్రీలో 2.5 లీటర్ 16 సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 181 పిఎస్‌ల శక్తిని, 4100 ఆర్‌పిఎమ్ వద్ద 233 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. అమెరికాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన టొయోటా ప్రస్తుతం సుమారు 110 దేశాల్లో లభ్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల్లో క్యామ్రీ కారును ఉత్పత్తి చేస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లోనే టొయోటా క్యామ్రీ సెడాన్‌ను అసెంబ్లింగ్ చేయనున్నారు. టికెఎమ్‌కు బెంగుళూరులో బిడదిలో ఉన్న ప్లాంట్‌లో ఈ కారును అసెంబ్లింగ్ చేయనున్నారు. ఇందులో ఉపయోగించే విడిభాగాలలో సుమారు 10 శాతం విడిభాగాలను దేశీయ మార్కెట్‌ నుంచే కొనుగోలు చేయనున్నానుర. క్యామ్రీ అసెంబ్లింగ్ కోసం 18 కోట్ల రూపాయల పెట్టుబడిని వెచ్చించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, August 24, 2012, 16:00 [IST]
English summary
Toyota has launched the 2012 Camry with a starting price of Rs.23.8 lakhs. The facelifted new Camry will be built in Toyota's plant near Bangalore. This will help Toyota keep the new Camry's price at a competitive level. The Camry was unveiled by Nobuyuki Takemura, the managing coordinator (Sales and Marketing) Toyota Kirloskar Motor.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+