లక్ష కార్ల అమ్మకాల మార్కును తాకిన టొయోటా ఎతియోస్
దేశంలో కార్ మార్కెట్ వాతావరణం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఎతియోస్ కార్లు మంచి డిమాండ్‌ను కనబరిచాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏటా 1,20,000 యూనిట్లుగా ఉన్న ఈ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2013 ప్రారంభం నాటికి 2,10,000 యూనిట్లకు పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
ఇది తమకో ముఖ్యమైన మైలురాయి అని, తమ బ్రాండ్‌పై విశ్వాసం ఉంచి దానిని అంగీకరించిన లక్ష మంది వినియోగదారులకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని టొయోటా కిర్లోస్కర్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నకాగవ తెలిపారు. జపాన్ సునామీ, థాయ్‌లాండ్ వరదలు వల్ల ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో సైతం తాము ఈ మైలురాయి అధిగమించగలిగామని గుర్తు చేశారు.
వినియోగదారులకు మరింత చేరువ అయ్యే దిశలో భాగంగా, 2013 ప్రారంభం నాటికి మొత్తం అవుట్‌లెట్‌ల సంఖ్యను 220కు చేర్చడానికి టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. వీటిల్లో 25 అవుట్‌లెట్‌లు ప్రత్యేకించి సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో ప్రారంభించనుంది.


Click it and Unblock the Notifications









