భారత్‌లో డీజిల్ ఇంజన్ ప్లాంటు ఏర్పాటుపై టొయోటా కన్ను
అయితే, డీజిల్‌పై సబ్సిడి విషయమై రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తమ ప్లాంట్ ఏర్పాటు విషయం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రూ.500 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఓ పెట్రోల్ ఇంజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. అలాగే, బెంగళూరులో ట్రాన్సిమిషన్స్ ప్లాంట్ విస్తరణ కార్యకలాపాలాను కూడా నిర్వహిస్తోంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డీజిల్ కార్ల డిమాండు ఊపందుకోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గడచిన సంవత్సరంలో టొయోటా విక్రయించిన మొత్తం కార్లలో దాదాపు 70 శాతం డీజిల్ కార్లే ఉండటం, కంపెనీ అందిస్తున్న ఎతియోస్, లివాలకు డీజిల్ వేరియంట్లకు డిమాండ్ పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.
కాగా.. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో టొయోటా సరికొత్త వేరియంట్లను విడుదల చేసింది. ప్రపంచ మార్కెట్లలో కంపెనీ అందిస్తున్న హైబ్రిడ్ కారు ప్రయస్‌తో పాటుగా, ల్యాండ్ క్రూజర్, ఫార్చ్యూనర్, ఇన్నోవా మోడళ్లలో సరికొత్త రిఫ్రెష్డ్ వేరియంట్లను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications









