చైనాలో 1.60 లక్షల ఎస్‌యూవీలను రీకాల్ చేసిన టొయోటా
జులై 21, 2005 నుంచి నవంబర్ 28, 2008 మధ్య కాలంలో తయారైన 13,474 వాహనాలు, అలాగే ఫిబ్రవరి 6, 2009 నుంచి అక్టోబర్ 31, 2010 మధ్య కాలంలో తయారైన 1,47,310 వాహనాలు ఈ రీకాల్‌కు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ రీకాల్ కేవలం చైనా మార్కెట్‌కు మాత్రమే పరిమితమని టొయోటా స్పష్టం చేసింది.
టొయోటా ఆర్ఏవి4 ఎస్‌యూవీలలో అమర్చిన వెనుక సస్పెన్షన్‌లోని లోవర్ స్వింగ్ ఆర్మ్‌లలో ఉపయోగించిన లోపపూరితమైన నట్‌ల కారణంగా, కొంతకాలానికి అవి వదులుగా అయ్యి స్వింగ్ ఆర్మ్స్ నుంచి తొలగిపోయే ప్రమాదం ఉండటంతో కంపెనీ ఈ రీకాల్ చేయనుంది. ఈ లోపం గురించి కంపెనీ వినియోగదారులకు ప్రత్యేకంగా తెలియజేసి, ఉచితంగా దీనిని సవరించడం జరుగుతుంది.
ఇండియన్ మార్కెట్ కోసం సరికొత్త మోడళ్లు:
ఇదిలా ఉండగా.. రానున్న రోజుల్లో టొయోటా భారత మార్కెట్‌కు సరికొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. దేశీయ విపణిలో టొయోటా తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే దిశలో భాగంగా, మరిన్ని మాస్ సెగ్మెంట్ వాహనాలను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. తక్కువ ధర కలిగిన మినీ ఎమ్‌పివి టొయోటా అవాంజా, టొయోటా రష్ ఎస్‌యూవీలను కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కాగా.. ఈనెల 24న సరికొత్త అప్‌గ్రేడెడ్ క్యామ్రీని టొయోటా భారత్‌లో విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications









