టొయోటా నుంచి అతిపెద్ద రీకాల్: 74 లక్షల కార్లు వెనక్కి

By Ravi

కార్లను ఎక్కువగా రీకాల్ చేయటం (సమస్యల కారణంగా వెనక్కు పిలిపించడం)లో ప్రసిద్ధికెక్కిన జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా మోటార్ కార్పోరేషన్ ఈసారి గతంలో ఇదివరకెన్నడూ లేని విధంగా గరిష్టంగా 74 లక్షల కార్లను రీకాల్ చేయనుంది. ఈ రీకాల్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ ఉండనుంది. టొయోటా ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన విట్జ్, యారిస్, కరోలా, క్యామ్రీ కార్లలో పవర్ విండోస్ సమస్య కారణంగా ఈ రీకాల్ చేయనుంది.

ఈ కార్లలో ఉపయోగించిన పవర్ విండో స్విచ్ సరిగ్గా పనిచేయని కారణంగా విండోలు సరిగ్గా ఓపెన్/క్లోజ్ అవ్వని కారణంగా వీటిని కంపెనీ రీకాల్ చేయనుంది. ఈ మొత్తం రీకాల్‌లో 24.7 లక్షల వాహనాలను అమెరికాలో, 14 లక్షల వాహనాలను చైనాలో 13.9 లక్షల వాహనాలను యూరప్‌లో, 8700 వాహనాలను ఇండియాలో టొయోటా రీకాల్ చేయనుంది. 1996లో అమెరికన్ కార్ మేకర్ ఫోర్డ్ ఏకంగా 79 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆ తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమలో ఇంత భారీ సంఖ్యలో రీకాల్ చేయటం ఇదే మొదటిసారి.

ఇండియాలో జులై 30, 2008 నుంచి డిసెంబర్ 31, 2008 మధ్య కాలంలో తయారైన టొయోటా కరోలా ఆల్టిస్, అలాగే సెప్టెంబర్ 1, 2006 నుంచి జులై 31, 2008 మధ్య కాలంలో తయారైన టొయోటా క్యామ్రీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రీకాల్ క్రిందకు వర్తించే కార్లకు సంబంధించి సదరు కస్టమర్లకు టొయోటా వ్యక్తిగతంగా సమాచారం అందించి ఈ సమస్యను ఉచితంగా పరిష్కరించనుంది.

గత 2006-08 మధ్యకాలంలో ఉత్పత్తి అయిన వాహనాల్లో ఈ సమస్య ఉన్నట్లు టొయోటా గుర్తించింది. జపాన్‌లో 4,59,300 వాహనాలను, ఆస్ట్రేలియా మరియు ఆసియాల్లో 6,50,000 వాహనాలను, మిడిల్ ఈస్ట్‌లో 4,90,000 వాహనాలను, కెనెడాలో 2,40,000 వాహనాలను, ఇతర ప్రాంతాల్లో 330,000 వాహనాలను రీకాల్ చేసినట్లు టొయోటా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ సమస్య కారణంగా ప్రమాదాలు సంభవించినట్లు ఇంతవరకూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 10, 2012, 15:42 [IST]
English summary
Toyota India has voluntarily recalled 8,700 cars in India for potential problem of failure of Power Window switches in their Toyota Corolla Altis cars manufactured between 30th July 2008 to 31 December 2008 and Toyota Camry cars manufactured between 1 September 2006 and 31st July 2008.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+