టిఆర్‌డి ఎడిషన్ ఎతియోస్ సెడాన్‌ను విడుదల చేసిన టొయోటా
స్పోర్టీ ఫీల్ కోరుకునే వినియోగదారులను సంతృప్తి పరచేందుకు టొయోటా ఇప్పుడు కొత్త అస్త్రాలను సంధిస్తోంది. ఇటీవలె లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్, కరోలా ఆల్టిస్ సెడాన్, ఇన్నోవా ఎమ్‌పివిలను దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన టొయోటా, ఇప్పుడు తాజా లిమిటెడ్ ఎడిషన్ ఎతియోస్ సెడాన్‌ను విడుదల చేసింది. 'టొయోటా ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో' అనే బ్యాడ్జ్‌తో మార్కెట్లో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌కు విశిష్టమైన లుక్‌నిచ్చేందుకు గాను కంపెనీ దీనికి కొన్ని కాస్మోటిక్ మార్పులను చేసింది.
టొయోటా ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో లిమిటెడ్ ఎడిషన్ సెడాన్‌లో 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట అండ్ రియర్ బంపర్స్ మరియు స్పాయిలర్స్, సైడ్ స్కర్ట్స్‌తో కూడిన బాడీ కిట్, డోర్లపై టిఆర్‌డి స్పోర్టివో స్టిక్కర్స్, టిఆర్‌డి స్పోర్టివో బ్యాడ్జింగ్, క్రోమ్ కోటింగ్ కలిగిన గేర్ నాబ్, టిఆర్‌డి స్పోర్టివో లోగోలతో కూడిన డ్యూయెల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి మార్పులు ఉన్నాయి. అయితే, ఇంజన్ పెర్ఫామెన్స్‌ల పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఎతియోస్ సెడాన్‌లో లభిస్తున్న ఇంజన్‌నే ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ఉపయోగించారు.
ప్రస్తుత పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకొని, అమ్మకాలను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో టొయోటా సరసమైన ధరలకే లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. కాగా.. పెట్రోల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.6.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.7.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. సాధారణ టొయోటా ఎతియోస్ సెడాన్‌లో లభిస్తున్న 'జి' వేరియంట్‌కు అప్‌గ్రేడెడ్ రూపమే ఈ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్.
టొయోటా ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో హైలైట్స్:
- ఫ్రంట్ బంపర్ స్పాయిలర్
- సైడ్ స్కర్ట్స్
- స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్
- రియర్ బంపర్ స్పాయిలర్
- కొత్త 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్
- కొత్త డ్యూయెల్ టోన్ సీట్ ఫ్యాబ్రిక్
- సిల్వర్ షిఫ్ట్ లివర్ గేర్ నాబ్
- పెట్రోల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ.6,25,322 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
- డీజిల్ వెర్షన్ ఎతియోస్ టిఆర్‌డి స్పోర్టివో ధర రూ. 7,31,445 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications









