ఫోటో-లింక్డ్ ఛలాన్‌లతో ట్రాఫిక్ రూల్ బ్రేకర్ల ఆట కట్టు

By Ravi

Traffic Cop
హైదరాబాద్: తాము ఏ తప్పు చేయకపోయినా, తమపై తప్పుడు చలానాలు విధిస్తున్నారని మోటారిస్టులు తరచూ ఫిర్యాదులు చేయటం, తాము తప్పు చేసినట్లు సాక్ష్యం చూపించాల్సిందిగా వారు ట్రాఫిక్ విభాగపు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో, ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (హెచ్‌టిపి) ఓ అధునాతన విధానాన్ని పరిచయం చేయనుంది. ఇప్పటికే బెంగుళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మెట్రో నగరాల్లో అనుసరిస్తున్న ఫోటో-లింక్డ్ ఛలాన్ సిస్టమ్‌ను మన రాష్ట్రంలో కూడా పరిచయం చేయాలని హెచ్‌టిపి నిర్ణయించింది.

ఈ ఫోటో-లింక్డ్ ఛలాన్ సిస్టమ్‌లో భాగంగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫోటో సాక్ష్యంతో పాటుగా చలాన్‌ను పంపించడం జరుగుతుంది. ఈ ప్రతిపాది కొత్త వ్యవస్థను మరో రెండు నెలల్లోగా అమల్లోకి తీసుకువస్తామని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన మోటారిస్టులకు ఫోటో సాక్ష్యంతో పాటుగా ఛలాన్‌ను పంపించడం జరుగుతుందని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సివి ఆనంద్ ది హాన్స్ ఇండియాతో తెలిపారు.

కేవలం హార్డ్ కాపీని పంపడం మాత్రమే కాకుండా, ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో హెచ్‌టిపి అధికారిక వెబ్‌సైట్‌లో ఫోటోతో సహా ఈ-ఛలాన్‌ను కూడా పొందవచ్చు. ఇలా వచ్చిన ఛలాన్‌ను ట్రాఫిక్ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండానే, వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింక్ సాయంతో ఆన్‌లైన్ పేమెంట్ చేయొచ్చు. ఛలాన్‌లను వసూలు చేసే ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు, సందిగ్ధతలను తొలగించేందుకే గత కొద్ది కాలంగా ఈ-ఛలాన్ చేస్తున్నామని ఆనంద్ చెప్పారు.

ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్, వన్-వే ఎంట్రీ మొదలైన సాధారణ తప్పిదాలను ఆన్ ది స్పాట్‌లో రికార్డ్ చేసి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయటం ద్వారా మోటారిస్టుల చిరునామాకు ఛలాన్ పంపించడం జరుగుతుంది. చాలా మంది వాహన చోదకులు తమ తప్పిదాలకు సాక్ష్యాలు కావాలని హెచ్‌టిపి ఫేస్‌బుక్ ఫ్యాన్‌పేజ్‌లో కోరుతున్నారని, రోజుకు సుమారు 4,000 నుంచి 5,000 ఛలాన్‌లను జారీ చేస్తుంటామని, ఇంత భారీ సంఖ్యలో వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేయటం సాధ్యం కాదు కాబట్టే, ఈ ఫోటో-లింక్డ్ ఛలాన్ సిస్టమ్‌ను పరిచయం చేస్తున్నామని ఆయన చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, October 8, 2012, 18:52 [IST]
English summary
With complaints from motorists that they were being wrongly charged and were being made to run around the office of the traffic department for having asked for proof that they had violated the rules, the Hyderabad Traffic Police (HTP) has now decided to send challan along with photographic evidence of the violation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+