కారు నడిపి పసికందును పొట్టనబెట్టుకున్న బాలుడు

సరైన అవగాన మరియు శిక్షణ లేకుండా వాహనాలను నడపటం నేరం. అంతేకాదు.. వాహనాలు నడపటానికి, డ్రైవింగ్ లైసెన్సును పొందటానికి చట్ట ప్రకారం ఏ వ్యక్తికి అయినా కనీసం 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. అప్పుడే అతను చట్టపరంగా వాహనం నడపటానికి అర్హులు. అండర్ ఏజ్ పిల్లలు వాహనాలు నడపటం అత్యంత ప్రమాదకరమని వారికి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలి. లేకపోతే ఇదిగో ఈ సంఘటన మాదిరిగానే వారి బంగారు భవిష్యత్తు కాస్తా కటకటాల పాలు అవుతుంది.

ఢిల్లీలోని ఓ 14 ఏళ్లుడు చట్టానికి విరుద్ధంగా కారును డ్రైవ్ చేసి ఓ 6 ఏళ్ల బాలిక మరణానికి కారణం అయ్యాడు. అంతేకాదు, ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలు తీవ్ర గాయాలపాలు కాగా, మరో పది మంది వరకూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని జూపిటర్ అనే ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ బాలుడు మారుతి ఆల్టో కారును రివర్స్ చేస్తుండగా, అదుపు తప్పి వెనుక వైపు ఉన్న ముగ్గురు పిల్లలపై నుంచి దూసుకుపోయి వెనుకగా ఉన్న గేటును గుద్దుకుంది.

ఈ ప్రమాదంలో మున్నీ అనే 6 ఏళ్ల బాలిక ఆస్పత్రికి తీసువెళ్తుండగా మార్గ మధ్యంలోనే మరణించగా, హిమాన్షి (4 ఏళ్లు), కనికా (10 ఏళ్లు) అనే ఇద్దరు ఆడపిల్లలు విరిగిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సదరు అబ్బాయ్ కారు దిగి పరారు కాగా.. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో పోలీసులు ఆ అబ్బాయిని వెతికి పట్టుకొని చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీకి అప్పగించారు.

అయితే, కేసును వెనక్కు తీసుకునేందుకు మరణించిన మున్నీ బాలిక తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. అసలు 14 ఏళ్ల బాలుడికి కారును డ్రైవ్ వారి తల్లిదండ్రులు ఎలా చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సంఘటనతో సదరు బాలుడి బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు కావటమే కాకుండా, మున్నీ తల్లిండ్రులకు సైతం తీరని లోటును మిగిల్చింది.

ఈ సంఘటను చూసిన తర్వాతనైనా తల్లిదండ్రులు చలించక తప్పదు. వాహనాల పట్ల తమ పిల్లలకు తామే సవివరంగా అర్థమయ్యేలా చెప్పాలి. సరైన వయస్సు, అవగాహన వచ్చిన తర్వాత, వాహనాల డ్రైవింగ్ పట్ల పూర్తి శిక్షణను ఇచ్చిన తర్వాతమే వారిని డ్రైవ్ చేయటానికి అనుమతివ్వాలి. లేకపోతే ఆ బాలుడి మాదిరిగా వారి జీవితాలు కూడా మధ్యలోనే మసకబారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి, ఇకనైనా తెలుసుకొని, జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 26, 2012, 10:50 [IST]
English summary
There has been a lot of incidents where under-age teens with no driving licence driving vehicles and creating panic on the roads. This has mainly been occurring due to negligence or over excitement with the latest incident being a 14-year-old running over a 6-year-old girl.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+