నేటి నుండి వానాలకు సన్ ఫిల్ములు వాడకంపై నిషేధం అమలు
నల్లటి ఫిల్ములు కలిగిన వాహనాల ద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలు పెరుగిపోతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ములను ఉపయోగించడాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్-ది-స్పాట్‌లోనే సన్‌ఫిల్మ్‌లను తొలగించడం జరుగుతుంది.
"మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి". సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్‌లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.
ఇకపై కొత్త వాహనాలకు సన్ ఫిల్ములను ఉపయోగించినా లేదా ప్రస్తుతం ఉన్న వాహనాలకు సన్ ఫిల్ములను తొలగించకపోయినా రూ.500 వరకూ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా పోలీసులు మీ లైసెన్సును రద్దు చేయటం లేదా మీ వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









