వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్ టాటా నానో విడుదల
ఇలాంటి వారి ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని, వాటిని క్యాష్ చేసుకునేందుకు గోవాలోని ఓ డీలర్ టాటా నానో కారును అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్ది వీటికి అదనపు ఫీచర్లను జోడించి "వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్" పేరుతో అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ కారుతో పాటుగా ఆకర్షనీయమైన బహుమతులను ఆఫర్ చేస్తున్నారు.
టాటా నానోలో టాప్-ఎండ్ వేరియంట్ అయిన "నానో సిఎక్స్" రోగ్ రెడ్, నియాన్ రష్ (గ్రీన్) అనే రెండు రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ కారుపై ప్రేమకు చిన్నహమైన హృదయపు గుర్తులను (హార్ట్ సింబల్) ముద్రించి దానిపై "మై లవ్" అని పెయింట్ చేయబడి ఉంది.
టాటా నానో వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్‌లో వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్ గ్రాఫిక్స్, ఫాగ్ ల్యాంప్స్, పాటలు భద్రపరుచుకునేందుకు ఓ పెన్ డ్రైవ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఫోన్‌స్టాండ్‌తో పాటుగా ఓ మొబైల్ ఫోన్, ఎయిర్ ఫ్రెష్‌నర్, ప్రొటెక్టివ్ సన్‌ఫిల్మ్, యూఎస్‌బి ఆప్షన్ కలిగిన ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, మ్యాటింగ్స్, మడ్‌ఫ్లాప్స్‌లను అదనంగా అందించనున్నారు.
అయితే, ఇన్ని అదనపు ఫీచర్లు కలిగిన ఈ స్పెషల్ ఎడిషన్ టాటా నానో ధర సాధారణంగా లభించే సిఎక్స్ వేరియంట్ ధర కన్నా రూ.20,000 అధికం. గోవాలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2,05,993. వీటిని కేవలం 20 యూనిట్ల వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎడిషన్ టాటా నానోలను మాత్రమే తయారు చేశారట. అసలే గోవా టూరింగ్ స్పాట్, లవర్స్ స్పాట్ కావడంతో ఈ కారుకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మరి ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ప్రేయసి మీరేం కానుక ఇస్తున్నారు..?


Click it and Unblock the Notifications









