సహారా ఫోర్స్ ఇండియా కోసం మాల్యా భారీ పెట్టుబడులు
పెట్రోల్ కొనుక్కునేందుకే ఇబ్బందులు పడుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థల అధినేత విజయ్ మాల్యా తన ఫార్ములా వన్ టీమ్ 'సహారా ఫోర్స్ ఇండియా' ఇండియా కోసం 32 మిలియన్ డాలర్లను వెచ్చించారు. మెల్‌బోర్న్‌లో జరగనున్న ఫార్ములా వన్ రేస్‌లో విజయ్ మాల్యా జట్టు కూడా పాల్గొననుంది.
పర్సనల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ వాట్సన్ 10 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. మిగిలిన 22 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుండి, అలాగే విజయ్ మాల్యా లిక్కర్ కంపెనీ యునైటెడ్ బ్రివరీస్ నుండి పొందినట్లు తెలుస్తోంది. 2012 కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో గడచిన ఆరవ స్థానంలో నిలిచిం సిల్వర్‌స్టోన్‌కు చెందిన ఈ టీమ్ ఈసారి అగ్రస్థానంపై కన్నేసింది.


Click it and Unblock the Notifications









