టొయోటా కార్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లి
ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఫేమ్‌ను క్యాష్ చేసుకునేందుకు టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, కోహ్లిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా టొయోటా బ్రాండ్‌కు విరాట్ కోహ్లి ప్రచారం నిర్వహిస్తాడని టికెఎమ్ పేర్కొంది. యువతకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతోనే యువకుడైన విరాట్ కోహ్లితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని కంపెనీ తెలిపింది.
తమ బ్రాండ్ మార్కెటిగ్ ప్రణాళికలో భాంగగా కోహ్లితో టొయోటా ఈ డీల్‌ను కుదుర్చుకుంది. కానీ, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. విరాట్ కోహ్లి కేవలం టొయోటాకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ కాదు. టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న టీవీఎస్ స్టార్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌కు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి కోహ్లి క్యాంపైన్‌తో టొయోటా బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం టొయోటా ఎతియోస్ సెడాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ వ్యవహరిస్తున్నాయి. అయితే, మరి కోహ్లి రాకతో రెహ్మాన్ తప్పుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. ఇకపోతే టొయోటా అందిస్తున్న ఇన్నోవా ఎమ్‌పివికు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్నారు.


Click it and Unblock the Notifications









