పోలో, వెంటో కార్ల ధరలను పెంచనున్న ఫోక్స్‌వ్యాగన్!

కార్ కంపెనీలు మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ కంపెనీ వచ్చే నెల నుంచి ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కూడా ఇదే తరహాలో వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనుంది.

ఇదే గనుక జరిగితే వచ్చే నెల నుంచి ఫోక్స్‌వ్యాగన్ కార్లు మరింత ప్రియం కానున్నారు. ఈ పెంపు 3 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. వాస్తవానికి ఫోక్స్‌వ్యాన్ ఇండియా ప్రస్తుతం ధరలను పెంచకపోవడమే ఉత్తమం. అసలే సన్నగిల్లిన అమ్మకాలతో సతమవుతున్న కంపెనీపై ఈ తాజా ధరల పెంపు మరింత ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది. ఈ పెంపుతో ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పోలో, వెంటో కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రెండ్‌లైన్ (పెట్రోల్) - రూ.4,57,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో కంఫర్ట్‌లైన్ (పెట్రోల్) - రూ.5,08,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ (పెట్రోల్) - రూ.6,04,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ 1.6 (పెట్రోల్) - రూ.6,38,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రెండ్‌లైన్ (డీజిల్) - రూ.5,59,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో కంఫర్ట్‌లైన్ (డీజిల్) - రూ.6,10,000
* ఫోక్స్‌వ్యాగన్ పోలో హైలైన్ (డీజిల్) - రూ.7,06,000

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* ఫోక్స్‌వ్యాగన్ వెంటో ట్రెండ్‌లైన్ (పెట్రోల్, ఎమ్‌టి) - రూ.6,99,000
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో ట్రెండ్‌లైన్ (డీజిల్) - రూ.7,99,000
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ (పెట్రోల్, ఎమ్‌టి) - రూ.8,23,000
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో కంఫర్ట్‌లైన్ (డీజిల్) - రూ.8,74,000
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ (పెట్రోల్, ఏటి) - రూ.9,21,000
* ఫోక్స్‌వ్యాగన్ వెంటో హైలైన్ (డీజిల్) - రూ.9,23,000

More from DriveSpark

Article Published On: Tuesday, August 28, 2012, 12:45 [IST]
English summary
Volkswagen, the German carmaker is said to be planning to increase the price of the Polo and Vento in a few days. According to reports, VW's best selling cars will soon be costlier by as much as 3%.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+