2011లో 109 శాతం పెరిగిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ అమ్మకాలు

ఇదే సమయంలో పూణేలోని ఛాక్కన్ ప్లాంటులో 180 శాతం ఉత్పత్తి వృద్ధిని సాధించి 1,05,535 కార్లను ఉత్పత్తి చేశామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తం అమ్మకాలలో ఆడి, స్కొడా, ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌లు కలిసి ఉన్నాయి. 2010 సంవత్సరంలో కంపెనీ కేవలం 53,341 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
ఫోక్స్‌వ్యాగన్ 2011లో మొత్తం 10 కొత్త కార్లను విడుల చేసి భారత్‌లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను 21 మోడళ్లకు పెంచుకుంది. ఇదే సమయంలో ఫోక్స్‌వ్యాగన్ తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు 56 డీలర్లను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం డీలర్ల సంఖ్య 219కు పెరిగింది. అలాగే 2010లో 2.5 శాతంగా ఉన్న మార్కెట్ వాటాను దాదాపుగా రెట్టింపు (4.9 శాతం) చేసుకుంది.


Click it and Unblock the Notifications








