ఐపిఎల్ ఎడిష్ వెంటో, పోలో కార్లను ప్రవేశపెట్టనున్న ఫోక్స్‌వ్యాగన్
గడచిన సంవత్సరంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న వెంటో సెడాన్‌లో ఐపిఎల్ సందర్భంగా కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. గతంలో ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన ఐపిఎల్ ఎడిషన్ వెంటోలో ఐపిఎల్ లోగో డిజైన్ చేసి, ఈ కారును కొనుగోలు చేసిన వారికి క్రికెట్ కిట్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందించింది. ఏప్రిల్ 4వ తేదీ నుండి ఐపిఎల్ 20-20 సీజన్ 5 ప్రారంభం కానుంది.
గడచిన సంవత్సరం విడుదల చేసిన వెంటో ఐపిఎల్ ఎడిషన్ విజయవంతం కావటంతో ఈసారి పోలో హ్యాచ్‌బ్యాక్, వెంటో సెడాన్‌లలో ఎంపిక చేసిన వేరియంట్లలో అధనపు ఫీచర్లను జోడించి అందిస్తామని, ఈ ప్రత్యేక మోడళ్లపై ఎలాంటి అధనపు ధరను వసూలు చేయబోమని కంపెనీ తెలిపింది. కాబట్టి, ప్రస్తుతానికి వెంటో, పోలో కార్లను కొనాలనుకునే ప్రయత్నాలను విరమించుకొని, ఐపిఎల్ సీజన్ టైమ్‌లో ఈ కార్లను కొనుగోలు చేస్తే మంచిది.


Click it and Unblock the Notifications









