పెట్రోల్ వేరియంట్ జెట్టాను ప్రవేశపెట్టనున్న ఫోక్స్‌వ్యాగన్
జర్మన్ కార్ మేకర్ ఫోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'జెట్టా'లో ఓ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్ కలిగిన ఓ పెట్రోల్ వేరియంట్ జెట్టా సెడాన్‌ను ఏప్రిల్ నెలలో ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేయనుంది. ఇప్పటి వరకూ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుంది. జెట్టా సెడాన్‌ను ఫోక్స్‌వ్యాగన్ తొలిసారిగా ఆగస్టు 2011లో దేశీయ విపణిలోకి విడుదల చేసింది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన స్కొడా లారా, సూపర్బ్ మోడళ్లలో 1.8 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించడం జరుగుతుంది. మొదట్లో ఇదే ఇంజన్‌ను జెట్టాలో కూడా అందిచవచ్చని భావించడం జరిగింది. అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో భారతీయ కొనుగోలుదారులకు ఫ్యూయెల్ ఎఫీషియంట్ ఆప్షన్‌ను అందించాలని కంపెనీ నిర్ణయించింది.
అందుకే ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్ వేరియంట్లో 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ సెగ్మెంట్లో ఉన్న హోండా సివిక్, టొయోటా కరోలా ఆల్టిస్, రీనాల్ట్ ఫ్లూయెన్స్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా రాకతో స్కొడా లారా, సూపర్బ్ అమ్మకాలు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications









