పెట్రోల్ కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్న ఫోక్స్‌వ్యాగన్
త్వరపడండి.. ఫోక్స్‌వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. స్టాక్ క్లియరెన్స్ సేల్‌లో భాగంగా 2011 మోడల్ కార్లపై ఫోక్స్‌వ్యాగన్ నమ్మశక్యం కాని ఆఫర్లను అందిస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను వదలి డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దీంతో గత ఏడాది కాలంగా పెట్రోల్ కార్ల అమ్మకాలు ఢమాల్ అని క్రిందకు పడిపోయాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్ మోడల్ కార్లను విక్రయించుకునేందుకు కార్ కంపెనీలు నానా అవస్థలు పడుతున్నాయి. అందుకే పెట్రోల్ వేరియంట్ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఆఫర్ చేసి కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫోక్స్‌వ్యాగన్ కూడా 2011లో తయారైన పెట్రోల్ కార్లపై ఆకర్షనీయమైన తగ్గింపులను అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న 2011 మోడల్ 1.2 లీటర్, 1.6 లీటర్ పోలో కార్లపై ఏకంగా రూ.50,000 నగదు తగ్గింపును (క్యాష్ డిస్కౌంట్), రూ.60,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్ మరియు రెండేళ్ల పాటు వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్)ను కూడా ఆఫర్ చేస్తోంది. అంటే మొత్తమ్మీద ఫోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.1 లక్షల తగ్గింపు లభిస్తుందన్నమాట.
అలాగే, 2011 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెంటో కారుపై ఏకంగా రూ.1 లక్ష నగదు తగ్గింపును (క్యాష్ డిస్కౌంట్) అందిస్తుంది. 2011 మోడల్ పోలోపై లభిస్తున్న రూ.60,000 విలువైన ఉచిత ఇన్సూరెన్స్ రెండేళ్ల యాన్యువల్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఆఫర్‌ను 2012 మోడల్ పోలోపై కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.
అయితే, 2012 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెంటో కారును పొందాలంటే కనీసం నెల రోజులకు పైగా వేచి ఉండాల్సి వస్తుంది. ఇందుకు కారణంగా ఓవర్‌లోడెడ్ బుకింగ్‌లు కాదు, తగ్గిన డిమాండ్ కారణంగా వీటిని పరిమిత సంఖ్యలో ఉత్పత్తి చేస్తుండటమే. మరికెందుకు ఆలస్యం చవక ధరలో పెట్రోల్ వేరియంట్ పోలో, వెంటో కార్లను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే అదునైన సమయం. త్వరపడండి.. ఈ ఆఫర్ స్టాక్ మిగిలి ఉన్నంత వరకు మాత్రమే.


Click it and Unblock the Notifications









