వెంటో కారులో అకస్మాత్తుగా మంటలు: బ్రతికి బయటపడ్డ డ్రైవర్

పూనేలోని ఎఫ్‌సి రోడ్డులో చోటు చేసుకున్న ఈ సంఘటన యావత్ ఆటోమొబైల్ ప్రియులను అప్రమత్తం చేసింది. 40 ఏళ్ల కైలాష్ సురేష్ గుప్తా, ఓ షాప్‌కు ఎదురుగా పార్క్ చేసి, షాపింగ్ చేసి తిరిగి వచ్చిన పిమ్మట కారును స్టార్ట్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు.
కారులో కూర్చున్న కైలాష్ సీట్ బెల్ట్ పెట్టుకోటంతో మంటలు చెలరేగిన సమయంలో కారులో నుండి వెలుపలకి రావటానికి ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఆయన శరీరం దాదాపు 60 శాతం వరకూ కాలిపోయింది. రోడ్డుకు అటుపక్కగా వెళ్తున్న వారు కారు మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించి కైలాష్‌ను రక్షించారు.
కాలిపోయిన కారు ఫోక్స్‌వ్యాగన్ వెంటో 1.6 టిడిఐ డీజిల్ ఇంజన్ కారు. ఈ కారు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రధాన కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి ఇంజనే కారణమై ఉండొచ్చనే ఉద్దేశంతో ఈ ఇంజన్‌పై ఫోక్స్‌వ్యాగన్ నిపుణులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.


Click it and Unblock the Notifications








