సిఎన్‌జీతో నడిచే సిటీ బస్సులను విడుదల చేయనున్న వోల్వో

Volvo CNG Bus
స్వీడిష్ బస్సుల తయారీ సంస్థ 'వోల్వో బస్ కార్పోరేషన్'కు చెందిన భారతీయ అనుబంధం సంస్థ వోల్వో బసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (విబిఐపిఎల్) త్వరలోనే సిఎన్‌జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్)తో నడిచే సిటీ బస్సులు భారత్‌లో విడుదల చేయనుంది. ప్రస్తుతం వోల్వో దేశీయ మార్కెట్లో అందిస్తున్న "వోల్వో 8400" సిటీ బస్‌ను సిఎన్‌జీతో పనిచేసే విధంగా కంపెనీ తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సిఎన్‌జీ వేరియంట్ సిటీ బస్సులను వోల్వో ట్రైల్ రన్ నిర్వహిస్తోంది.

గడచిన జనవరి నెలలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో "వోల్వో 8400" సిటీ బస్సును కంపెనీ ఆవిష్కరించింది. రానున్న జులై-ఆగస్ట్ 2012 నాటికి ఇది వాణిజ్యపరంగా మార్కెట్లో లభ్యం కానుంది. అయితే, సిఎన్‌జీ వాయువు ఢిల్లీ, ముంబై వంటి కొన్ని ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కావడంతో దేశంలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు.

ఈ సిఎన్‌జీ బస్సులను బెంగుళూరులో ఉన్న హోస్‌కోట్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇతర బస్సులతో పోల్చుకుంటే తమ బస్సులు 20-30 శాతం మంచి కవరేజ్‌ను ఇస్తున్నాయని, భవిష్యత్తులో భారత్‌లో తమ ఇతర ఉత్పత్తుల కన్నా సిఎన్‌జీ బస్సుల నుండే అధిక వృద్ధి లభించగలదని ఆశిస్తున్నామని వోల్వో బస్ కార్పోరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆకాశ్ పాస్సే తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, February 6, 2012, 14:55 [IST]
English summary
Volvo Buses India Private Ltd (VBIPL), a subsidiary of Swedish bus maker Volvo Bus Corporation, is set to launch Volvo 8400 low-floor CNG city bus in India during July-August this year. The trials of CNG bus are presently going on in Delhi and Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+