బెంగుళూరు రోడ్లపై పరుగులు పెట్టనున్న వోల్వో హైబ్రిడ్ బస్

Volvo Hybrid Bus
ప్రీమియం బస్సుల తయారీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకున్న, స్వీడన్‌కు చెందిన ప్రముఖ బస్సుల తయారీ సంస్థ "వోల్వో", ఇటీవల బెంగుళూరు ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన సరికొత్త హైబ్రిడ్ బస్సు "వోల్వో 7700"ను త్వరలోనే బెంగుళూరులో బిఎమ్‌టిసి సిటీ బస్‌గా విడుదల చేయనున్నామని కర్ణాటక రాష్ట్ర రవాణా మంత్రి ఆర్ అశోక్ వెల్లడించారు.

105 సీట్లు కలిగిసిన ఈ సింగిల్ బస్సును నగర రోడ్లపై జనవరి నుండి రెండు నెలల పాటు ట్రైల్ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఇది డీజిల్ ఇంధన వ్యయాన్ని 30 శాతం వరకూ తగ్గిస్తుందని, అతి తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని అశోక్ విలేఖరులరు తెలిపారు. ఇది డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్లతో నడుస్తుంది.

ఇందులో 5-లీటర్ ఎమ్‌డి5, ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్‌డ్, ఇంటర్‌కూల్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 210 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 800 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. ఈ రెండు ఇంజన్లు విడివిడిగా కానీ, లేదా రెండింటినీ ఒకేసారి కానీ ఉపయోగించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 24, 2012, 16:47 [IST]
English summary
Bangaloreans may soon enjoy the joyful and comfortable ride in Volvo Diesel-Electric Hybrid city buses "Volvo 7700". This bus, which has unveiled at the 2012 Delhi Auto Expo earlier this month, would be launched on Bangalore roads soon, Karnataka Transport Minister R Asoka told to reporters.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+