చౌక రకం కార్లను విడుదల చేసిన వోల్వో ఇండియా

ఇది వరకూ ఈ మోడళ్లు డి5 సిరీస్ డీజిల్ ఇంజన్‌లో లభ్యమయ్యేవి. కాగా, వోల్వో ఇండియా కొత్తగా విడుదల చేసిన ఎస్60, ఎస్80, ఎక్స్‌సీ60 వాహనాల్లో డి3 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అందుకే వీటి ధరను భారీగా తగ్గించడం జరిగింది. వీటిల్లో డి3 ఇంజన్లను ఉపయోగించినప్పటికీ పెర్ఫామెన్స్ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని వోల్వో పేర్కొంది. డి5 ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతున్న ఈ మోడళ్ల ధరలు రూ.27 లక్షల నుంచి రూ.39.5 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
ఈ మూడు మోడళ్లు కూడా పూర్తిగా విదేశాల్లో తయారు చేయబడి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో వీటిని ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న డి5 ఇంజన్లను అమర్చిన ఎస్60, ఎస్80, ఎక్స్‌సీ60 మోడళ్లను యదావిధిగా కొనసాగిస్తామని, మరింత శక్తివంతమైన ఇంజన్‌తో విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారి కోసం వీటిని అందుబాటులో ఉంచుతామని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








