రాష్ట్ర మార్కెట్లో చౌకరకం వేరియంట్లను ప్రవేశపెట్టిన వోల్వో

స్వీడన్‌ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన చౌకరకం మోడళ్లను రాష్ట్ర విపణిలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. డి3 డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యే ఎస్‌60, ఎస్‌80 సెడాన్లు, ఎక్స్‌సీ60 ఎస్‌యూవీలను వోల్వో హైదరాబాద్‌లో విడుదల చేసింది. రాష్ట్ర మార్కెట్లో వీటి ధరలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) ఈ విధంగా ఉన్నాయి.

* వోల్వో ఎస్60 ధర - రూ.24.5 లక్షలు
* వోల్వో ఎస్80 ధర - రూ.32.6 లక్షలు
* వోల్వో ఎక్స్‌సీ60 ధర - రూ.34.6 లక్షలు

ఈ మోడళ్లు ఇప్పటి వరకూ శక్తివంతమైన డి5 డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యేవి. అయితే, ఈ మోడళ్లను సరమైన ధరకు అందించడమే కాకుండా, అధిక మైలేజీనిచ్చేందుకు గానూ డి3 డీజిల్ ఇంజన్‌తో కంపెనీ అందిస్తోంది. ఎంట్రీ లెవల్ వేరియంట్లో సైతం హై ఎండ్ వేరియంట్‌లో లభ్యమయ్యే ఫీచర్లు ఉండటం ఈ మోడళ్ల ప్రత్యేకత. డి5 ఇంజన్‌ను అమర్చిన వేరియంట్ల అమ్మకాలను కూడా కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది.

ఈ మూడు మోడళ్లు కూడా పూర్తిగా విదేశాల్లో తయారు చేయబడి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. వోల్వో ఎస్60 లీటర్ డీజిల్‌కు 18.5 కి.మీ. మైలేజీ, వోల్వో ఎస్80 17.8 కి.మీ. మైలేజీ, వోల్వో ఎక్స్‌సీ60 14.7 కి.మీ. మైలేజీనిస్తుంది. ప్రస్తుతం వోల్వో ఇండియాకు దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో 7 డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

మరో రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో వోల్వో ఉంది. వోల్వో ఇండియా కార్లలో 30 శాతం ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 2012లో 1,800 కార్లను విక్రయించనున్నామని వోల్వో ఆటో ఇండియా మార్కెటింగ్ అండ్ పీఆర్ డెరైక్టర్ సుదీప్ నారాయణ్ వెల్లడించారు. 2011లో 320 కార్లను విక్రయించామని, 2020 నాటికి భారత లగ్జరీ కార్ల మార్కెట్లో 15 శాతం వాటాను సొంతం చేసుకోవాలనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, February 24, 2012, 17:37 [IST]
English summary
Volvo, the Swedish carmaker has launched three new variants of its models in Hyderabad that are priced much lower than their predecessors . Volvo has taken on its competitors head on by offering its products at a much lower price despite selling all its models as CBUs (Completely Built Units). CBUs attract more excise tax than cars that are assembled within India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+